Verse 1
యెహోవా యోసేపుకు తోడైయున్నాడు
ఎక్కడవున్నా ఏమిచేసినా తోడైయున్నాడు - 2
Verse 2
అన్నలందరూ ద్వేషించినా తోడైయున్నాడు
తల్లిదండ్రులు దూషించినా తోడైయున్నాడు
కొట్టి గుంటలో త్రోసివేసినా తోడైయున్నాడు
తిట్టి సొమ్ముకై అమ్మివేసినా తోడైయున్నాడు ||యెహోవా ||
Verse 3
శత్రువులెన్నో నిందలేసినా తోడైయున్నాడు
చెరసాలలో శోధించినా తోడైయున్నాడు
ఆ చిన్నవాడినే ఐగుప్తుకు రాజును చేశాడు
నా మాట నమ్మితే నిన్ను కూడా రాజును చేస్తాడు
మహరాజును చేస్తాడు ||యెహోవా ||