Verse 1
కృపగల దేవా కలువరి నాధా - కొనియాడెద నీ ఘననామం
Verse 2
సిలువ సితార నే చేబూని - కలువరి ప్రేమనే గానము చేసెద
సిలువలో పాపికి రక్షణ కలదని - సిలువే నా జీవిత విలువని ||కృపగల ||
Verse 3
మంటి ఘటమునగు నాయందు నీవు - మహిమైశ్వర్యము నింపిన దేవా
నాలో ప్రవహించే - ఓ జీవ జలరాశి నీ సాక్షిగ ధర జీవించెద ||కృపగల ||
Verse 4
మహిమతో నీవు విచ్చేయువేళ - కడబూర మ్రోగగ నిను సంధింతును
రెప్పపాటులో - మార్పు నొందెదను - అక్షయ రూపము నే దాల్తును ||కృపగల ||
Verse 5
హల్లెలూయా... హల్లెలూయ