Verse 1
ఆనందం సంతోషం
సర్వలోక ప్రజలందరికీ - కలిగెను మహదానందం
కోట్ల దూతగణములు - ఇలలో చాటెను సమాధానం
అ.ప. సమాధాన వార్తను స్వీకరించు సోదరా
నిజ క్రిస్మస్ పరవశంతో నీ హృదిని నింపవా ||ఆనందం||
Verse 2
కుటుంబాన శాంతిలేక సొమ్మసిల్లినా
స్నేహితులే అపార్ధాలతో చెలిమి మానినా
శాంతి - చెలిమిని పంచుటకు సాక్షాత్తూ యెహోవాయె
నరరూపము దాల్చీ - యేసు రక్షకుడై జన్మించెను ||ఆనందం ||
Verse 3
ఆత్మలో నెమ్మదిలేక అలమటించినా
జీవితాన అసంతృప్తి రాజ్యమేలినా
తృప్తి నెమ్మది నిచ్చుటకు సాక్షాత్తూ సర్వేశ్వరుడే
నరరూపము దాల్చి - యేసు రక్షకుడై జన్మించెను ||ఆనందం ||