Verse 1
కృపయే ఆధారము - కృపయే అనివార్యము
నీ కృపను బట్టి - రక్షణను పొందితిని, నిన్ను ఘనపరిచెద
ప్రభు నిన్ను స్తుతియించెద -2
Verse 2
స్వేచ్ఛ కోరి నీ ఆజ్ఞను నే గైకొనకపోయితి
హద్దు మీరి నీ ఎదుట పాపము చేసితి -2
అయినా నీ కృప నా యెడల చూపుచు
నాకై శిలువలో ప్రాణమును పెట్టితివి
నేడే హృదయము ప్రభు నీకు అర్పించెద ||కృపయే ||
Verse 3
తనువు ఇచ్ఛలకు లోబడి అతిక్రమము చేసితినే
ఎఱిగి యుండి పాపముకు దాసుడను అయ్యితి
అయినను నన్ను నీ కుమారునిగా చేయుటకు
నాకై క్రయధనముగా నీ రక్తమిచ్చితివి
నేడే హృదయము ప్రభు నీకు అర్పించెద ||కృపయే ||