Verse 1
స్తుతియించెదను - మనసారా నిన్ను
భజియించెదను - జగదీశా నిన్ను
నా పూర్ణ మనస్సుతో - నా పూర్ణ ఆత్మతో
సేవించెదను నిన్నే బలముతోను శక్తితోను || స్తుతియించెదను ||
Verse 2
సర్వము నెరిగిన నా యేసయ్యా - ప్రేమను పంచిన ప్రేమా స్వరూపా
కృపా కనికరములు - మాకు స్వాస్థ్యములుగా
అర్పించితివి కరుణామయుడా ..... ||స్తుతియించెదను ||
Verse 3
నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము - నీ హస్తములో నిత్యసౌఖ్యములు
నీతి సమాధానములు - వారసత్వములుగా
అందించిన నీతి సూర్యుడా ..... ||స్తుతియించెదను ||
Verse 4
యోచనకర్తవై ఆదరంచినావయా - శోధన వేళలో సమాధాన కర్తవై
దయా సత్యములు - కంఠ భూషణములుగా
దయచేసిన ప్రాణనాధుడా ..... ||స్తుతియించెదను ||