Verse 1
స్వాగత గీతిక - స్వామి యేసునకు
స్వాగత గీతిక - పరమ విభునికి - 2
Verse 2
జగములకంతయు అధిపతివైనను
చెదరిన గొఱ్ఱెల వెదకుట కొరకై - ఆ ఆ ఆ
కరుణతో కన్నియ గర్భము నందున
వెలసిన రక్షకా ముదముతో నీకు ||స్వాగత గీతిక ||
Verse 3
నలిగిన మనసున శాంతియె కరువై
ఎదలో మమతలు ఎరుగనివాడనై - ఆ ఆ ఆ
పథములు తప్పిన పాంధుడనైనను
పరమున స్థానము నొసగేటి దేవ ||స్వాగత గీతిక ||