జయహే జయహే జయహే జయహే
జయజయ దేవసుతా జయజయ విజయసుతా || జయహే ||
సిలువలో పాపికి విడుదల కలిగెను - విడుదల కలిగెను
కలువరిలో నవజీవన మొసగెను - జీవన మొసగెను
సిలువ పతాకము జయమును గూర్చెను
జయమని పాడెదను - నా విజయము పాడెదను - 2 ||జయహే ||
మరణపు కోటలో మరణమె సమసెను - మరణమె సమసెను
ధరణిలో జీవిత భయములు దీరెను - భయములు దీరెను
మరణములో సహా జయములు నావే ||జయమని ||
శోధనలలో ప్రభుసన్నిధి దొరికెను - సన్నిధి దొరికెను
వేదనలే రణభూమిగ మారెను - భూమిగమారెను
శోధన బాధలు బలమును గూర్చెను ||జయమని ||
ప్రార్థన కాలము బహుప్రియమాయెను - బహుప్రియమాయెను
సార్థకమాయెను దేవుని వాక్యము - దేవుని వాక్యము
ప్రార్థనలే బలిపీఠము లాయెను ||జయమని ||
పరిశుద్ధాత్ముని ప్రాపక మొదవెను - ప్రాపక మొదవెను
వరుడగు యేసుని వధువుగ మారితి - వధువుగ మారితి
పరిశుద్ధుడునను సాక్షిగ పిలచెను ||జయమని ||