Verse 1
నీ నామ కీర్తన గానము చేసెద - నా యేసు మనసారా
నీ సాక్షిగానే ఇలజీవించెద - కడవరకు ప్రియమార
Verse 2
నా శ్రమలో నీకు మొర పెట్టగా - నా ప్రార్థనాలించినావు
మరణభీతితో కృంగియుండగా - బ్రతికించిబలపరచినావు
ఎత్తైన స్థలములో నీ కొరకు వెలిగే - స్తుతి పాత్రగా చేసినావు
నీ మహిమనే చూపినావు ||నీ నామ|| ||నా ||
Verse 3
నీ సాయమే నా విజయము - నీ సహకారమే నా ప్రాకారము
నీ వాగ్ధానమే నాకు ధైర్యం - నీ వాక్య ధ్యానమే నాకు సర్వం
నా దారిదీపమై నా దివ్యగమ్యమై నీ ధ్వజముగా నిలుపుము
కడవరకు నడిపించుము ||నీ నామకీర్తన|| ||నా ||
Verse 4
నా శైలమా నాదుర్గమా నాశృంగమా నా ఆశ్రయమా
నారక్షకా విమోచకా - నాబలమా నాకేడెమా