అన్ని తెలిసిన తల్లి మరియమ్మా
నీ వెన్న మనసులో వేదన ఏందమ్మా
కరిగే కొడుకును కన్నది నువ్వమ్మా
నీ గుండెలో బరువును తీసేదెవరమ్మా
మది సిలువలో తనయుని పలుమార్లు తలచి
నిలువెల్ల వణికి నిదురంత పోయేనా..
పుట్టినరోజులు పండుగలేవమ్మా
ఈ కారణజన్ముడు కరుణామయుడమ్మా
గట్టిగ పట్టిన ఆపగ లేవమ్మా
గొల్గొతా గమనం తప్పదు ఓయమ్మ
అది మనకోసమేనమ్మా... ||అన్ని తెలిసిన||
గొల్లలంతా కలిసి మెల మెల్లగ చేరిరి
తమ పిల్లన గ్రోవితో లాలిపాటను పాడిరి
తూరుపు దేశపు జ్ఞానుల మంటిరి
నింగి చుక్కను కనుగొని బహు చక్కగా చేరిరి
బంగారం సాంబ్రాణి అర్పించి రారాజు యాజకుడు అని యెంచి
మొకరించి బహుమతులిచ్చి ఆ మహిమంతా మనసుకు తెలిపి
బోళము నెందుకు తెచ్చిరి ఓ యమ్మ
ఆ మరణపు సూచిక కంటివా మరియమ్మా
బోరున వచ్చిన కన్నీరేదమ్మా నీ గుండెను గుచ్చిన తరుణం కదా అమ్మా
అది మనకోసమేనమ్మా... ||అన్ని తెలిసిన||
ఎనిమిదో దినమున యెరూషలేము వచ్చి
పేరు యేసు అని పెట్టి ఎంతగానో మురిసిరి
సిమోయోను వచ్చెను ఆ శిశువును చూసేను
మహా సంబరపడుచు బహు నెమ్మది నొందెను
తన ఆత్మ నింపబడి ఎత్తుకుని – మన లోక రక్షణ కై ముద్దాడి
తన తనువు చాలింప తృప్తిపడి – ఆ మహిమంతా జనులకు తెలిపి