Verse 1
ఉదయించెను నక్షత్రం తూర్పుదిక్కున
ఉద్భవించె రక్షకుడు బెత్లెహేమున
చేర్చుకొనుము ఈక్షణమే హృదయమందున
చేరుకొనగ నీవును మోక్షనగరున || ఉదయించెను ||
Verse 2
రక్షకుని రాకతో పుడమి పులకరించింది
గగనాన దూతాళి స్వాగతమ్ము పలికింది - 2
ఆనంద గీతికల హల్లెలూయ పాడింది హల్లెలూయ - 5
అంధకార జీవితాన వెలుగురేఖ వెలసింది ||ఉదయించెను ||
Verse 3
మహిమ శరీరుడు మనకై మహిని యవతరించెను
మన పాపములన్నిటిని పరిహరింపను - 2
రక్షుకుడే రానిచో రక్షణయే లేదుగా - 2
రక్తమిచ్చి కొన్న నిజరక్షకుడు యేసెగా ||ఉదయించెను ||