Verse 1
పాడెద నేను స్తుతి గీతములే - యేసుని గూర్చి స్తుతి స్తోత్రములన్
పరవశించి పరమాత్మునికై - భక్తితో బహు సంతోషముతో
Verse 2
అనుక్షణము పాడెదను నా రాజు కొరకు - ఆత్మానందముతో ఆరాధించెదను
ఆశతో పాడెదను ఆనంద గీతం - ఆర్భాటించెదను అభినయముతో ||పాడెద ||
Verse 3
నే మొఱలిడగ నా మొఱనాలించె - కరమును చాపి నను రక్షించెన్
నా సర్వస్వం అర్పింతు నీకె - కీర్తించెద నిన్నే జీవితకాలం ||పాడెద ||