బైబిల్ గ్రంథమె అందరిని - ఆనందము జేసెడి గ్రంథమేగా
అర్ధములో గూడార్ధములన్నిటి - నందరికిని బోధించునదే
బైబిలు గ్రంథము పిలుపును వింటే - మనసులో మార్పులు చేయునుగా
శుద్ధులుగా పరిశుద్ధుల జేసి - యిద్దరి మనల భద్రపరచునుగా ||బైబిల్ ||
బైబిలు గ్రంథమె బంగారుకంటెను - మేలిమి పసిడిని మించెనుగా
తేనెలలో జుంటె తేనెల కంటెను - మనసునకెంతో మధురములాయెను ||బైబిల్ ||
దేవుని వాక్యము జీవము గలదై - బలము గలదియై ఫలము గలదిగా
ఖడ్గములలో రెండంచుల ఖడ్గమై - వాడిగ నుండి కీడుజయించును ||బైబిల్ ||
ప్రాణాత్మలను కీళ్ళను మూల్గును - పాయలుగా విభజించునుగా
ఆలోచనలతో ఆత్మతో దూరుచు హృదయ తలంపుల శోధించునుగా ||బైబిల్ ||
ఆదిలో యేసే ఆత్మగ ఉండి - పతితపావనుడై దురితమును వీడె
దురితమోయుత ప్రతిదేశముకై - హితభాస్కరుండై దురితముబాసె ||బైబిల్ ||
ఎందరు యేసును అంగీకరింతురో - అందరి కాయన అందునుగా
తన నామమును నమ్మిన వారిని - దేవుని పిల్లల జేయునుగా ||బైబిల్ ||