Verse 1
ప్రతివేకువ నీ ప్రస్తుతి పాడుచు - చిన్ని చెకోరినై యున్నను చాలు
కొమ్మ కొమ్మన కమ్మని తావులు - విరిసే పూవునై యున్నను చాలు
ప్రభుయేసూ నీ ప్రస్తుతి పాడెద || ప్రతి వేకువ నీ ||
Verse 2
మండుటెడారిని ఎండిన బ్రతుకుల
తడిపెడి వర్షపు చినుకైన చాలు - 2
చీకటి రాత్రుల భీతిని మాన్పెడి
చిరుదీపమునై వెలిగిన చాలు ||ప్రతి వేకువ నీ ||
Verse 3
ముక్తి పధంబున ముదముగ నీ పద
ధూళిగ నిలిచియుండిన చాలు - 2
శక్తితో నీ అనురక్తిని గెలిచెడి
భక్తి భావమై ప్రభలిన చాలు ||ప్రతి వేకువ నీ ||
Verse 4
సిలువను మోసి సొలసిన నీపై
మలయ పవనమై మసలిన చాలు - 2
మరణ విజయ నీ మహిమను చాటు
ఉదయరాగమై యుండిన చాలు ||ప్రతి వేకువ నీ ||