Verse 1
యేసయ్యా నీ నామగానం నేపాడెద జీవితాంతం
శోధన వేదన బాధలు కల్గిన - నే పాడెద శాంతిగీతం
హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా ||2||
Verse 2
జీవాది, పతివైన దేవా! నిత్యజీవంబు నా కొసగినావా
జీవ జలమై జీవాహారముగా పరమునే విడిచినావా
హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా
Verse 3
నీమాట నానోట పాడగా - ప్రభువా నీ మాటే నా బ్రతుకు బాటగా
ప్రకటింతునయ్యా నీ సిలువ వార్త ప్రాణమున్నంత వరకూ
హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా