Verse 1
సార్వభౌముడు యేసు సర్వాధికారి యేసు
సకల చరాచర సృష్టికర్త - సర్వముతానై నడిపించువాడు
Verse 2
ప్రకృతిపై తానధికారి పాపము బాపిన పరిహారి
రోగము తీసిన ఉపకారి సర్వమానవుల సహకారి
దయ్యాలపైన జయశీలి మరణము గెలిచిన ధీశాలి ||సార్వ ||
Verse 3
పాపభారముతోడ కృంగినవారికి నీడ
ప్రేమతో పిలిచెను ప్రియమార క్షమియించును నినుమనసార
నిత్యమునడుపును కృపతోడ సాగుము మానక ప్రభుతోడ ||సార్వ ||
Verse 4
నాకు చాలినవాడు నన్ను బ్రోచినవాడు
జీవితాంతము నాతోడు వీడను నిన్ను అన్నాడు
మరలా వచ్చి తనతోడు తీసుకువెళతానన్నాడు ||సార్వ ||