దేవా నీ దివ్య వాక్యము ఈవిగ మాకు నిచ్చితివి
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ || దేవా ||
పాపముతో నిండిన మమ్ము దీపము వంటి వాక్యమే
కల్వరికి నడిపించి కలుషమును తొలగించి
మా హృదయమును వెలిగించెను.... ఓ.... - 2 ||దేవా ||
పాల వంటి వాక్యము తేనె కంటె మధురము
వెండి బంగారముల వెల యెంతయైనను
తులతూగవు నీ వాక్యముతో.... ఓ.... - 2 ||దేవా ||
నిర్మల క్షీరము వంటిది నిత్యానందం వంటిది
నీ పాలతో మముపెంచి - నీ తోటలో మము ఉంచి
నీ బలము మాకీయుమా.... ఓ.... - 2 ||దేవా ||
సుత్తెయై మెత్తన చేయున్ - విత్తనమై ఫలియించును
ఖడ్గము వలె దూయుచూ - కలుషములను కోయుచు
నీ మహిమను - మా కీయుమా.... ఓ.... - 2 ||దేవా ||
అద్దమువలె దిద్దును మమ్మున్ - అగ్నియై కాల్చును చెత్తన్
నీ వాక్యము వివరించి మా లోటును సవరించి
నీ రూపము మాకీయుమా.... ఓ.... - 2 ||దేవా ||
వాక్యముతో నింపితివి - సాక్షులుగా పంపితివి
నీ చేతిలో మముదాచి - నీ చూపుతో మముగాచి
నీ సన్నిధి మాకీయుమా.... ఓ.... - 2 ||దేవా ||