Verse 1
ఇశ్రాయేలు రాజువే
నా దేవా నా కర్తవే
నే నిన్ను కీర్తింతును
మేలులన్ తలంచుచు (2)
Verse 2
యేసయ్యా... యేసయ్యా... (2)
వందనం యేసు నాథా
నీ గొప్ప మేలులకై
వందనం యేసు నాథా
నీ గొప్ప ప్రేమకై
Verse 3
ఎన్నెన్నో శ్రమలలో
నీ చేతితో నన్నెత్తి
ముందుకు సాగుటకు
బలమును ఇచ్చితివి (2) ||యేసయ్యా||
Verse 4
ఏమివ్వగలను నేను
విరిగి నలిగిన మనస్సునే
రక్షణలో సాగెదను
నా జీవితాంతము (2) ||యేసయ్యా||