Verse 1
నాలో ప్రేమను వెలిగించితివి - వెలుగై నీవే వ్యాపించితివి
శాశ్వత జీవము నాకిచ్చితివి - మోక్షమార్గము చూపించితివి
Verse 2
శత్రువు నాయెడ సంతోషింపక - శోధనలో నుండి ఉద్దరించితివి - 2
శ్రమలో నీకు మొరపెట్టగానే - స్వస్థపరచి నను లేవనెత్తితివి ||నాలో ||
Verse 3
పాతాళమునుండి నా ప్రాణమును - కాపాడితివి నీ కరుణతో - 2
సమాధి చూడక సజీవునిగా - బ్రతికించితివి క్షేమముతో ||నాలో ||
Verse 4
నీ భక్తులకై దాచియుంచిన - మేలులు ఎంతో గొప్పవి - 2
ఉత్తముడవని రుచి చూచితిని - నిత్యము నిన్నే స్తుతియించెదను ||నాలో ||