Verse 1
సంపూర్ణమైన నీకృప - శాశ్వతమైనది నీకృప
మరువలేను నీదు నామం - మరపురానిది నీ కృప
Verse 2
పాపికి విడుదల నీవు చూపిన ఈకృప
పరమున చేర్చుట నీవు చూపిన ఈకృప
ఆత్మదేవుడ నీకృప - ఆరాధ్య దైవమ నీకృప ||సంపూర్ణ ||
Verse 3
విద్యలేని పామరులకు - నీవు చూపిన ఈకృప
తేజోవాసుల స్వాస్థమునందు - నీవు చూపిన ఈ కృప
ఆత్మదేవుడ నీకృప - ఆరాధ్యదైవమ నీకృప ||సంపూర్ణ ||