Verse 1
ప్రతిదినము శుభదినమే ప్రాణ నాధుడైన యేసుతో
ప్రతిక్షణము మధురక్షణము ప్రాణప్రియుని ఆరాధనలో హల్లెలూయా... - 8
Verse 2
పాపపు ఎండకు కాలి నిలువ నీడ కనరాక
తోడేలేని ఏడారి బ్రతుకులో.... - 2
సిలువ ప్రేమ ద్వజమే ఎగురుచు కనిపించే
ప్రియుడేసు జల్దరు వృక్షమై నిలచే.... - 2
ఆనంద భరితనై యేసు ప్రేమ నీడలో
సేద తీరెద యేసు ప్రేమ బాహువులలో - 2 ||ప్రతి దినము ||
Verse 3
నా పాప శాపమంతా ప్రియుడేసు మోసెను
అవమాన భారమంతా రూపుమాపెను.... - 2
ఈ అరణ్యయాత్ర ఎంతో ప్రయాసము
ప్రియుని మీద ఆనుకొని సాగిపోదును.... - 2
ఈ చులకని శ్రమ అంతా క్షణమాత్రమే త్వరలో
చేరుకొందును సీయోను నగరము.... - 2 ||ప్రతి దినము ||