Verse 1
నాలోని ప్రేమ నీదై యున్నది దేవా
ఆ ప్రేమలో నన్ను బలపరచుదేవా
నీ ప్రేమ లేనిదే - నే బ్రతుకలేను
Verse 2
నేను వెదకకముందే - నన్ను వెదకిన ప్రేమ ఇది
నేను ప్రేమించకముందే - నను ప్రేమించినది
సిలువలో నీ దివ్యప్రేమ - విలువకు అందనిది ||యేసయ్య ||
Verse 3
బాధ్యతయైన ప్రేమనీది - నన్ను భరించినది
భద్రతనిచ్చిన ప్రేమనీది - భారముబాపినది
బాధలో ఓదార్పునిచ్చి - బలము చేకూర్చెను ||యేసయ్య ||
Verse 4
పరిపూర్ణ ప్రేమలో - భయముండదు
నిండైన నీప్రేమ - భీతిని తొలగించు
ఎరిగితి నీ ప్రేమను - నమ్మితి ఆ ప్రేమను ||యేసయ్య ||
Verse 5
యేసయ్య నీ ప్రేమ - వర్ణింపనాతరమా