Verse 1
స్తుతిస్తోత్రములు ఘనతమహిమలు నీకే చెల్లునుగా స్తుతులకు పాత్రుడా
తరతరములకు దేవుడనీవే యుగయుగములకు పూజ్యుడనీవే
ప్రేమపంచిన దైవం నీవయ్యా - ప్రేమరూపుడ నీవే యేసయ్యా
Verse 2
పరమందు దూతగణముల్ నిత్యము స్తుతిగానముతో
ప్రణుతించి పాడును పరిశుద్ధ నీనామం
ప్రతిచోటను ప్రతిసమయమందునా - ప్రణుతింతు నీనామము ||నీవే ||
Verse 3
అల్ఫా ఓమేగవు నీవే మార్పులేని మా మహరాజా
మధురమైన నీప్రేమ నేమరువ జాలను
మహనీయుడా నీమధురప్రేమను - మనసార పాడి పొగడెదన్ ||నీవే ||
Verse 4
నాప్రాణ ప్రియుడవు నీవే నారక్షణాధారమా
మహిమలో నిన్నుచేర నేవేచియున్నాను
పరిశుద్ధుడా ఓ పావనాత్ముడా నీఆత్మతో నింపుమా ||నీవే ||
Verse 5
నీవే యేసయ్యా నాకు నీవేచాలయ్యా - 2