Verse 1
రక్షణ పొందితిని నేను త్రియేక నామమున
బాప్తిస్మం పొందితిని నాదు పాపమును విడిచి
నీతో పయనింప తగుశక్తిని నీయుమయా
సాతాన్ను ఎదిరింప ఆత్మ బలమును దయచేయి - 2
Verse 2
లోకము ఇవ్వలేనిది ఈ రక్షణ జీవితము
పరిశుద్ధుడు నాతో నుండి నా పాపము లొప్పించె - 2
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
ఈయన సాటిలేరు ఏకైక రక్షకుడు - 2
జీవితమంతా ఆయన అడుగు జాడలో నడిచెదను ||హల్లెలూయా ||
Verse 3
బాధలలోన బంధుమిత్రులు ఆదరించలేదు
చీకటి క్రియలు తరుముచుండగా దరికిచేరలేదు - 2
యేసు ఒక్కడే నాకు ఆ వెలుగును చూపించి
జిగట వూబినుండి నన్ను పైకి లేవనెత్తి - 2
శేష జీవితం ఆయనకై అర్పించెద నేను - 2 హల్లెలూయా - 4 ||రక్షణ ||
Verse 4
హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా - 4