Verse 1
అనగనగా ఒక ఊరుంది - ఆ ఊరు బెత్లేహేము
బెత్లెహేము ఊరిలోన - యోసేపను మనుజుని యింట
మరియమ్మను కన్నియ ఉంది - దైవబలము కలిగిన యువతి
ఆ కన్నియ గర్భములోన ఓ బాలుడు ఉదయించాడు
ఆ బాలుడు యేసయ్యంట ఓరయ్యా
దేవదూత సెలవిచ్చాడు వినవయ్యా || అనగనగా ||
Verse 2
తూరుపంత వెలుగులు నింపే
తార ఒకటి నేడు వెలుగుతోంది చూడు
చీకటింక మాయం పాపమంత దూరం
చిన్ని యేసు జగతికింక నేస్తం ||అనగనగా ||
Verse 3
శాంతి లేదు సుఖము లేదు
మనసు చీకటాయే బ్రతుకు భారమాయే
శాంతి సమాధానం ప్రేమ కరుణకోసం
రక్షకుండు నేడు పుట్టినాడు ||అనగనగా ||