Verse 1
యెహోవ కొరకు ఎదురుచూచువారు - నూతన బలమొందెదరు
పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగిరిపోవుదురు
అలయక పరుగెత్తెదరు సొమ్మసిల్లక సాగిపోవుదురు
మన ప్రభువుతో ఆనందింతురు
Verse 2
సొమ్మసిల్లినపుడు - బలమిచ్చువాడు ఆయనే
శక్తిహీనులైనవారి సేదదీర్చువాడు ఆయనే
గడ్డి ఎండిపోవును - పువ్వువాడిపోవును
తన వాక్యము నిత్యము నిలుచును ||యెహోవ ||
Verse 3
గొఱ్ఱెల కాపరివలె తన మందను మేపును
అలసిన గొఱ్ఱెలను రొమ్మున ఆనించి మోయును
భయపడకు నిన్ను ఘనపరతునని
తన బాహువు మనపై చాచును ||యెహోవ ||