Verse 1
కొండలతట్టు కనులెత్తుచున్నాను
నాకు మెండైన సాయం ఎటునుండి వచ్చును
సహాయమైన సహకారమైన - యెహోవా వలనే కదా
అతడే అండ అతడే బండ - అతడే నా కేడెము అతడే నా శైలము
Verse 2
తల్లి గర్భమున పిండమై యుండగ - దండిగ కాపాడినాడు
విసుగును చెందక మహిలో నన్ను - శిశువుగ దీవించినాడు
అతడే యేసు - అతడే క్రీస్తు - అతడే నా జీవము అతడే నా దైవము ||కొండల ||
Verse 3
దారి తొలగి నే దూరముకాగ - కుమరునిగా పిలిచినాడు
మనసున మమత కరుణను నింపి - మనిషిగ నను తీర్చినాడు ||అతడే ||
Verse 4
సర్వ పాపమును తానే భరించి - సిలువకు అంకితమయ్యాడు
నిత్య జీవమును నాకు నొసంగగ - మృత్యువునే గెల్చినాడు ||అతడే ||
Verse 5
రుధిరమిచ్చి తా కొన్న వధువుకై - వేగమే రానున్నాడు
పరమున చేరి ప్రియునితో నిత్యం - పరవశించెదను ||అతడే ||