Verse 1
స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే
రాజాధిరాజు దేవాది దేవుడు స్తుతులకు పాత్రుడు
Verse 2
మనుష్య కుమారుడై మనుజుల పాపముకై
మహిలోన వెలసెను మరణించి లేచెను (మహిమ స్వరూపుడు) - 2 ||స్తోత్రము ||
Verse 3
పాపపు వస్త్రము మార్చి నీతిమంతునిగా తీర్చి
పరిశుద్ధులతో చేర్చి పరముకు భాగ్యము నిచ్చి(మహిమ స్వరూపుడు) -2 ||స్తోత్రము ||
Verse 4
మేఘారూఢుడై మన ప్రభురానుండె
మహిమ శరీరంతో పరమున కేగెదము (మహిమ స్వరూపుడు)- 2 ||స్తోత్రము ||