Verse 1
ప్రేమా.... మారని ప్రేమ... నన్ను ప్రేమించిన తండ్రి ప్రేమ
మరణముకన్నా బలమైన ప్రేమ - అగాధజలం ఆర్పలేని శక్తిగల ప్రేమ
Verse 2
పాపమున్ ద్వేషించు ప్రేమ - పాపిని ప్రేమించు ప్రేమ
కార్పణ్యములేని ప్రేమ - కల్మషమును కడిగే ప్రేమ - 2
భారమును బాపే ప్రేమ - బాధలు తీర్చే ప్రేమ
నేరము లెంచని ప్రేమ - నెయ్యము చేసే ప్రేమ ||ప్రేమా ||
Verse 3
దురితేచ్ఛల ముసుగులోన- పాపేచ్ఛల పథములోన
పయనించే నా బ్రతుకును - మళ్ళించిన తండ్రి ప్రేమ
వెలుగుతో ననునింపి - పరిశుద్ధ ఆత్మనింపి
క్షాళనము చేయుప్రేమ - క్షేమకాలం చూపు ప్రేమ ||ప్రేమా ||
Verse 4
పక్షపాతంలేని ప్రేమ - అక్షయమైనదీ ప్రేమ
ప్రేమలన్నిటికంటే శ్రేష్టమైనది ప్రేమ
శిక్షనుండి విడిపించి - రక్షణలో నడిపించే
జనులందరినాదరించు - జీవాధిపతి ప్రేమ ||ప్రేమా ||