ఏ మనుజుడేమి ఎవ్వడైననేమి - ప్రభు పాదాలపై వ్రాలినవాడే
పాపక్షమాపణ పొందినవాడు - పరిశుద్ధునిగా మార్చబడును
లేత వయస్సును నడిప్రాయమును - గతించిపోవును స్థిరమేలేదు - 2
దేహమున్ చెరిపే వ్యాకులమంతయు
హృదయములో నుండి తొలగించుకొనుము
సృష్టిపై నీవు దృష్టియుంచినా - ఇష్టము చొప్పున ప్రవర్తించినా
దుష్టునిగా సంతుష్టి చెందినా - సృష్టికర్తయే పిలుపునీయగా
నిక్కముగా ఈ భువిని వీడు ||ఏమను ||
నరుల హృదయము ఎల్లప్పుడును - కలతలు నిండిన చెడుగు భాండమే - 2
జీవజలముల ఊటయైయున్న - యేసునినేడు మదినికోరుము
పిట్టలు వలలో పట్టబడునట్లు - చేపలు ఉరిలో చిక్కునట్లుగా
చేటుకాలమే కాటు వేయగా చీకటి బ్రతుకు ఆవరించగా
వెలుగు రేఖ ఇక యేసేగా ||ఏమను ||
ఇలభోగములే వాంఛించినచో - పరలోకములో భాగములేదు - 2
నిన్నరాదు రేపుందోలేదో - నేడే నీకు రక్షణ దినము
బ్రతుకునచావు పొంచియున్నది - లోకమే అంతరించనున్నది
క్రొత్తాకాశము క్రొత్తభూమియు - నిత్య రాజ్యములో ఏసేరాజు
వచ్చి చేరుమిక ఈరోజే ||ఏమను ||