Verse 1
నిన్ను క్షమియించి రక్షించి నిర్దోషిగా నెంచు యేసుని మించగల
నిబ్బర మిచ్చు నిశ్చలమైన ఆశ్రయపురమేది!
సమమేకాదు ఏది! తన సమమే కాదు ఏది!
Verse 2
పాప బంధకాలను త్రెంచెడి నామము
శాపపు కాడిని దించెడి నామము
వ్యసనములను మాన్పును పరిశుద్ధతతో నింపును
నీకై బంగారు ఇంటిని స్వర్గాన నిర్మించును ||హల్లె ||
Verse 3
ఆత్మలో నెమ్మది ఇచ్చెడి నామము
శాంతియు సౌఖ్యము పెంచెడి నామము
సిరుల ద్వారాలు తెరచును ఆస్తికర్తగ చేయును
నిన్ను మహా స్వాస్థ్యపు వారసునిగా చేయును ||హల్లె ||
Verse 4
దీర్ఘ శాంతముతో నింపెడి నామము
ప్రేమ కరుణలను చూపెడి నామము
వ్యాధులను తొలగించును బాధలను నిర్మూలించును
నిన్ను ఆత్మల వెలిగించు చిరు దివ్వెగా చేయును ||హల్లె ||
Verse 5
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా