Verse 1
మారుమనస్సు నొందుమా - జాగు చేయకు సోదరా
తడవు ఏల ప్రభు కడకేగగా - ఇక కడవరి కాలమాయెరా
Verse 2
అనుకూల సమయంబిదే - నీ మొరనాలకించుటకు
వెనుకాడితివ ఇక వేరే మార్గము నీవు కనలేవు ఈ జగతిలో ||మారు ||
Verse 3
పండు పండిన రీతిగా ఇక పరిపక్వమాయె లోకం
ఆత్మ రక్షణనీయ అవనిలో ప్రభుయేసు సిలువలో బలియాయెను ||మారు ||
Verse 4
ఆత్మ శుద్ధి లేకయే నీ ఆచారములు యేలనో
ఆత్మ రక్షణనీయ అవనిలో ప్రభుయేసు సిలువలో బలియాయెను ||మారు ||
Verse 5
సర్వమానవకోటికై యేసు చిందించె తన రక్తము
కల్వరి సిలువలో ఎల్ల మానవులకు గొప్ప రక్షణనిదే ||మారు ||
Verse 6
మారు మనస్సు లేకుండా నికోదేమువలె నుంటివా
మారుమనస్సునొంది మరణంబులోనుండి జీవంబులో దాటుమా ||మారు ||