Verse 1
స్తుతియింతుము స్తుతియింతుము-రాజులరాజును స్తుతియింతుము
ఆరాధింతుము ఆరాధింతుము-ఆత్మతో సత్యముతో ఆరాధింతుము ||2||
Verse 2
పరమును వీడిన మన తండ్రిని
పాపము కడిగిన మన యేసుని ||2||
ఆత్మతో నింపిన అభిషిక్తుని ||2||
పాటలు పాడి స్తుతియింతుము ||2|| ||స్తుతి ||
Verse 3
రక్తము కార్చిన మనక్రీస్తును
రక్షణ నిచ్చిన మనదేవుని ||2||
జీవము నిచ్చిన మన తండ్రిని ||2||
నాట్యము చేయుచు స్తుతియింతుము ||2|| ||స్తుతి ||