Verse 1
నా మార్గము నీవేనయ్యా - నా దుర్గము నీవేనయ్యా
నా బంధువు నీవేనయ్యా - నా సర్వము నీవేనయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
Verse 2
కష్టాలు ఎన్నైనా నష్టాలు ఏమైనా
తల్లిదండ్రులే మరచిన బంధుమిత్రులే విడచిన - 2
జీవిస్తా నీకోసం - యేసయ్యా - యేసయ్యా - 2 ||నా మార్గము ||
Verse 3
ఎనలేని నీ సేవ ఎన్నుకొని వచ్చాను
ఏది ఏమైనాగాని వెనుతిరిగి వెళ్లను - 2
బ్రతుకంతా నీకోసం - అర్పిస్తా యేసయ్యా - 2 ||నా మార్గము ||
Verse 4
బ్రతికుంటే నీసేవే చావైతే లాభమే
బ్రతుకంతా నీకోసం జీవిస్తూ ఉంటాను - 2
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా - 2 ||నా మార్గము ||