Verse 1
ఊహల కందని లోకములో - ఉన్నత సింహాసనమందు
ఉంటివిగా నిరంతరము - ఉన్నతుడా సర్వోన్నతుడా
Verse 2
సెరాపులు దూతాళి పరిశుద్ధుడు పరిశుద్ధుడని
స్వరమెత్తి పరమందు - పాటలు పాడెడి పావనుడా హల్లెలూయా - 4 ||ఊహ ||
Verse 3
నీ శిరము ధవళముగా - పాదములు ప్రకాశముగా
నేత్రములు జ్వాలలుగా - కంఠధ్వని జలపాతముగా హల్లెలూయా - 4 ||ఊహ ||
Verse 4
అల్ఫాయునూ ఒమేగయును - అన్ని కాలంబుల నున్నవాడ
సర్వాధికారుండా సర్వేశా - సజీవుండా హల్లెలూయ - 4 ||ఊహ ||