Verse 1
అంకితం నీకె దేవా - అందుకోవయ్యా
అంకితం నీకె దేవా - అందుకోవయ్యా.... అంకితం ప్రభో
ఆశ్రయంబుల్ ఆశలెల్ల - అంకితమయ్యా || అంకితం ||
Verse 2
దుర్మార్గులు నిను దూషించినను - దుఃఖము కలిగినను
కరుణను నొసగి కాచిన దేవా - ఆఆఆ - కానుకలివిగోనయా ||అంకితం ||
Verse 3
పాపములెల్ల పరుగిడజేసి పావనులనుజేసి - పరమ రహస్యం
కనుగొనజేసి - ఆఆఆ - పతకము నొసగుమయా ||అంకితం ||
Verse 4
నీవు ఒసగిన ఈవులనెల్ల - నీసేవ కొరకే
అణకువతోడ అర్పణజేతు - ఆఆఆ - అల్పులగాంచుమయా ||అంకితం ||