Verse 1
దేశమా - దేశమా - దేశమా యేసుమాట వినుమా
క్షామకాలమొస్తుంది - క్షేమమిక ఉండదు - ఆహారములేక
కలుగు కరువు కాదు - ప్రభువుని నమ్మనందుకే కలిగే క్షామం
ప్రభుని నమ్ముకుంటే నీకు క్షేమం ||దేశమా||
Verse 2
నోటికి కళ్ళెంపెట్టి మాటమలుచుకో
కళ్ళకు కాటుక దిద్ది దృష్టి మార్చుకో
నీ మనసును అణుచుకుని బ్రతకనేర్చుకో
నిలిచియున్న నీవు పడకుండ చూచుకో ||దేశమా ||
Verse 3
కళ్ళు వెళ్ళిన చోటికి నీ మనసు వెళ్లకూడదు
మనసెళ్ళిన చోటికి ఆ మనిషి వెళ్లకూడదు
అనేకులు అలా చేసి మోసపోయారు
నిన్ను నీవు తెలుసుకుని బుద్ధిగా మసలుకో ||దేశమా ||