Verse 1
మరనాత విశ్వాస సమాజం - మనందరి ఆత్మీయ సహవాసం
మరనాత - మరనాత - మరనాత - మరనాత
Verse 2
సోదర మానవులెందరినో - స్వాధీనము చేకొనె సాతాను
వారలజేరి సువార్తతోజీరి - స్వాతంత్య్రము నిడు ప్రభు పనివారం ||మరనాత ||
Verse 3
దేవుని సంఘము లోకముతో - చేతులు కలిపిన చీకటిలో
క్రీస్తు ప్రకాశము జగతికి జూప - దేవుడు లేపిన దివ్య సమాజం ||మరనాత ||
Verse 4
క్రీస్తుని రాకడ సమయముకై కాచుకొన్న నిజ భక్తులకై
ఓరిమితో ప్రభుకాడిని మోసే - జయజయ వీరుల సత్సహవాసం ||మరనాత ||