Verse 1
పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని
నిత్యము దూతలతో కొనియాడబడుతున్న నా యేసయ్యా - 2
వందనం ప్రభు వందనం - 2
Verse 2
సర్వలోకము నీ మహిమతో నిండియున్నది దేవా
గొప్ప స్వరముతో ప్రభుయేసు నామమునూ
గాన ప్రతిగానం చేసెద నేను - 2 ||పరిశుద్ధడు ||
Verse 3
నా కంఠ స్వరమువలన గడపకమ్ముల పునాదులు - కదులుచున్నవి దేవా
నా దేహమనే నీ ఆలయమందున
స్తుతి ధూపము వేసెద నిరతము నీకు - 2 ||పరిశుద్ధడు ||