Verse 1
నా పూర్ణ హృదయముతో స్తుతియించెదను
నా పూర్ణ మనస్సుతో కీర్తించెదను - 2
యేసు నాధా జీవప్రదాత - క్రీస్తు నాధా మోక్షప్రదాత
Verse 2
నీ దివ్య సిలువె నాకు విలువనిచ్చెను
నీదు గాయములే స్వస్థత చేకూర్చెను
నీదు మరణమే నాకు జీవమిచ్చెను
నీ పునరుత్థానమే క్రొత్త జన్మనిచ్చెను ||అనుదినము ||
Verse 3
నీ వాక్యముతో నిత్యము బ్రతికించుచున్నావు
నీ కృపతో నిరతము సేదదీర్చుచున్నావు
ఇహపరముల యందు నీవు నాకుండగా
నీకంటే మించినది నాకు లేదుగా ||అనుదినము ||
Verse 4
అనుదినము నీయందె అతిశయింతును
ప్రతిక్షణము నీలోనె పరవశింతును