సత్యవార్త ఉద్యమంలో ఒకభాగం - చాటించగ నిజదేవుని నిర్ణయం ||2||
పరిశుద్ధుని పరిపూర్ణ సాధనమై - వెలసింది మరనాత విశ్వాస సమాజము
ముందుగా ఎంచుకున్న మూలరాయిగా
మోజెస్ చౌదరి నామధేయునిగా - 2
వెలసింది అద్భుత నిర్మాణం
పలుతావుల విస్తరించుచున్న విధానం - 2
పిల్లలు పాపలు ప్రజలు యవ్వనులు వృద్ధులు
అందుకుంటున్న బహు ఆశీస్సులు
అందుకే తృప్తితో తలలు వంచుదాం
హృదయమార కృతజ్ఞతలు అర్పించుదాం ||ఇది ||
సత్యం విశ్వాసంతో విధేయతా నమ్మకం
గానం వాక్యాలతో సాక్ష్యం సంగీతం - 2
విద్య ఉద్యోగాలు వైద్యం విజ్ఞానము
సకల దేశాలలో సంచరించు అవకాశము - 2
సర్వ సమృద్ధితో నడిపించుమని
తన కార్యం నానాటికి వృద్ధిపర్చుమని - 2
ప్రభుపాద పద్మముల ప్రణమిల్లుదాం
అంతులేని దీవెనలతో ముందుకు సాగుదాం ||ఇది ||
ఇది ఆధ్యాత్మిక విప్లవం ఆధ్యాత్మిక విప్లవం - సువార్తలో విశ్వాసపు విజయపతాకం
వేలాది ప్రజావళికి పాప వినాశనం - లక్షలాది వ్యక్తులకు రక్షణమార్గం