Verse 1
గొప్ప దేవుడవు నీవు - మారని దేవుడవు
నమ్మకమైన వాడవు - నాకున్న నాధుడవు
పైనున్న - వాడవు
Verse 2
శోధనలు ఉప్పెనలా నాపై లేచిన
సుఖ దాయకమైన జీవితం నాతో వచ్చిన
కష్టాలైన - కుశలమైన
నిన్నే స్తుతింతును యేసు నిన్నే స్తుతింతును ||గొప్ప ||
Verse 3
వ్యాధులచే నిత్యమునే కృంగి కూలిన
ఆరోగ్యముతో కళకళ నిత్యం వర్ధిల్లిన
వేదనయైన ఆనందమైన నిన్నే స్తుతింతును
యేసు నిన్నే స్తుతింతును ||గొప్ప ||