Verse 1
పావనుడేసు పరమును వీడి - ధరకరుదెంచెనుగా
ప్రాణము దానము చేసి కల్వరిలో - పరమున కేగెనుగా - 2
Verse 2
సాగిలపడి ప్రభు సాన్నిధ్యములో - మనసారా స్తుతులొనరించి
సంతోషముతో గానముచేసి - తరియించెదము మనమెపుడు ||పావనుడేసు ||
Verse 3
ఎర్రనివైన మన పాపములను - తెల్లని హిమముగా మార్చుటకై
సిలువను మోసి సువార్తను చాటి - మనకే విజయము చేకూర్చే ||పావనుడేసు ||
Verse 4
తన దుఃఖమె మన సంతోషముగా - తన శాంతమె మన రక్షణగా
మృతినేగెల్చి జయమును పొంది - సాతానుని ఓడించెనుగా ||పావనుడేసు ||
Verse 5
మన శత్రువులను మిత్రుల - జేసి మనలను ఒకటిగ జేసెనుగా
మతములు లేనేలేవని చాటి - మార్గము నేనని రూపించె ||పావనుడేసు ||
Verse 6
మనప్రభు రాకడ నేడోరేపో - తెలియదు ఎవరికి జనులారా
మెళుకువ కలిగి ప్రార్ధించినచో - దేవుని బూర వినిపించున్ ||పావనుడేసు ||