Verse 1
దేవాదేవా త్వరగా రావా
నీ కోసమే నే వేచిఉన్నాను త్వరగా రావా నా యేసయ్యా
నీ పిలుపు కోసం చూచుచున్నాను త్వరగా రావా కరుణామయా
యేసయ్య మరనాత - కరుణామయ మరనాత
Verse 2
నీరాక ఎపుడో తెలియదుగాని నిరీక్షించుచున్నాను వస్తావని
నీ రాక సమయం ఏతెంచగా వస్తావు నీవే మహరాజువై ||యేసయ్య ||
Verse 3
కడదాక సాక్షిగా నిలవాలని కొనసాగుచున్నాను నీ సేవలో
హింసించబడినను నే జడియక సేవించుశక్తి (నీ)నాకీయుమా ||యేసయ్య ||
Verse 4
నీ ముఖము కనులారా చూడాలని నామనస్సు తొందర పడుచున్నది
నీ చెంత నిత్యము గడపాలని నా ఆత్మ వేగిరపడుచున్నది ||యేసయ్య ||