Verse 1
యేసు ప్రేమను మించిన - విలువ ఇల అగుపించునా
ఇది నిర్లక్ష్యం చేస్తున్న తరము - మార కుంటే తప్పదు నరకము
సిలువే... ఆశ్రయం - క్రీస్తే... ఆధారం
Verse 2
సువార్త సిరులను అనుభవించని కారణమువలనే
ఈ కరువులు - అరమరికలు
క్రీస్తు ప్రేమను ధరియించని లోపముల వలనే..
ఈ గతుకులు - అగచాట్లు
దీవెన కావాలంటే - మోక్షం చేరాలంటే ||సిలువే ||
Verse 3
మహా దేవుని మేలు మరచిన కారణమువలనే
ఈ ఇరుకులు - ఇబ్బందులు
ఆత్మీయతలో ఎదగకుండిన కారణమువలనే
ఈ వంచనలు - ఈ మోసములు
జ్ఞానము కావాలంటే జీవము పొందాలంటే ||సిలువే ||