Verse 1
శ్రీకరుండ శ్రీయేసునాధా - శ్రీమంతుడవు సృజనాత్ముడా
హోసన్న హల్లేలూయ హోసన్న హల్లేలూయ
Verse 2
పాపభారం భరియించినావు పాపినైన నాకొరకేగా
పవిత్రతతో నీ పాద సన్నిధిలో పరవశింతును పరమ ప్రభో ||హో ||
Verse 3
మరణపు ముల్లును విరచి నీవు మృత్యుంజయునిగా మరిలేపినావు
మహిమోన్నతుడా నీ మహిమలను మహిలో నేను చాటెదను ||హో ||
Verse 4
ఆశీర్వాదముల్ ఇచ్చెడివాడా అందుకో మా స్తుతి మాలిక
ఆప్తుడవై నన్ను ఆదరించి అభిషేకముతో నింపితివే ||హో ||