Verse 1
మాకు కాదు యెహోవా - మాకు కాదు
నీకే నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లుగాక
Verse 2
భూమి యాకాశములు సృజించినప్పుడు
సూర్యచంద్ర తారలను నిలిపినప్పుడు
శ్రేష్టమైన మానవుని చేసినప్పుడు
సృష్టికర్త నీవేయని - సర్వశక్తి నీదేయని
త్రిజగములు నిన్ను చేరి ప్రస్తుతించగా ||మాకు కాదు ||
Verse 3
బండ నుండి జీవజలం పారినప్పుడు
మిన్ను నుండి పరమ మన్నా కురిసినప్పుడు
సముద్రమే పాయలుగా చీలినప్పుడు
బయలుపడెను నీ మహిమ - తెలుపబడెను నీ ఘనత
ఎల్లరకు దేవుడవని ఎరుగునట్లుగా ||మాకు కాదు ||
Verse 4
కరము చాపి నీ సన్నిధి వేడినప్పుడు
కఠిన హృదయుడైన నన్ను మార్చినప్పుడు
నా జీవిత సంకటములు బాపినప్పుడు
తెలిసికొంటి నీమార్గం - నేర్చుకొంటి నీ వాక్యం
జీవముగల దేవుడవని ప్రకటింపగా ||మాకు కాదు ||