Verse 1
పరిశుద్ధాత్మ దైవమా - ఆదరణిచ్చు నేస్తమా
క్రీస్తును మనుజరూపమా - ప్రభావ వాక్య ఖడ్గమా
Verse 2
భీతి చెందియుండగా - ధైర్యపరచినావే
అలసి సొలసియుండగా - సేద దీర్చి నావే
మా పితరుల కాచింది నీవే
ప్రియ శిష్యుల సంధించినావే
నీ ఆత్మ మా ఊపిరి - యేసయ్యా - 2 ||ఆత్మ సత్యములతో ||
Verse 3
శాంతి లేని వేళలో నీ సన్నిధి చేర్చితివే
సొమ్మసిల్లియుండగా - వాక్కుపంపి నిలిపితివే
ఆదరణకు కర్తవునీవే - మాపాలిటి భర్తవు నీవే
నీవే పోషణకర్తవు - ఆధారమా ||ఆత్మ సత్యములతో ||
Verse 4
పగలు మేఘస్థంభమై - రాత్రి అగ్ని స్థంభమై
ఆకలైన మన్నానొసగి -ఆదుకొన్న తండ్రివే
సాగరమును చీల్చింది నీవే - జీవజలము ఊటవునీవే
నీవే జీవన దాతవు - దైవమా ||ఆత్మ సత్యములతో ||
Verse 5
ఆత్మ సత్యములతో చేతునీకే ఆరాధన
విరిగి నలిగిన హృదయముతో నీకే ఆరాధన