Verse 1
పూర్వమందు పితరులతో మాట్లాడిన దేవుడవు
ఈ దినముల అంతమందు మాతో మాట్లాడావు
నీ కొమరుడు క్రీస్తునందు ప్రపంచమును నిర్మించి
సకల ప్రజా విమోచన స్థిరపరిచావు || పూర్వమందు ||
Verse 2
దుఃఖములో మొరలిడిన దినాలున్నవి
ఆనంద భరితులుగా మము జేసితివి - 2
గుట్ట మెట్టలు లోయలు లోతులు దాటి
ఈ దశలో తిరిగి నిన్ను స్మరియించుచున్నాము ||పూర్వమందు ||
Verse 3
నీ కృపలేక ఒకదినము పొందగ లేము
అన్నవస్త్రములు కలిగి ఆనందించుచున్నాము - 2
ఎన్నో మలుపులు తిరిగి ఈ స్థితికి వచ్చాము
విలువైన ఈ బ్రతుకును నీకే అర్పించెదము ||పూర్వమందు ||
Verse 4
ఈ యాత్రలో పడినట్టి తప్పటడుగులు
కరములు పెదవులు జారిన సందర్భాలు - 2
కప్పుకొనక ఒప్పుకుని క్షమాభిక్ష వేడగా
నీతో పయనించుటకు కృపచూపితివి ||పూర్వమందు ||