యెహోవా రోహి -(6) యెహోవా నా కాపరి - 2
మందయగు ఇశ్రాయేలు - ముందునడిచావు - నన్ను నీమందలో చేర్చుకున్నావు.
మంచికాపరినీవు-ప్రాణమిచ్చి నావు-గొప్ప కాపరి నీవు కొదువేలేదు నాకు
ప్రధాన కాపరిగ-రానైయున్నావు-హోసన్నా...హల్లెలూయ 8 సార్లు
యెహోవా షాలోమ్-(6) యెహోవా సమాధాన కర్త - 2
పాపపరిహార బలి ద్వారా నీవు - సమాధాన పరచావు - దేవునితో మమ్ము
నదివోలెనే సమాధానము - ప్రవహింపజేతువు నీ ప్రజలకు
నా కున్న - నీ శాంతి - భువి ఇవ్వలేనిది ||హోసన్నా ||
యెహోవా మెకదేష్ -(6) పరిశుద్ధ పరచు యెహోవా - 2
పరిశుద్ధుడంచు సెరాపులంతా - ప్రతిగానములు సేయ రాత్రింబవళ్లు
ప్రత్యేకమైన జనాంగముగచేసి-పరిశుద్ధ పరచావు-పాపమును ఆపి ||హోసన్నా ||
యెహోవా సిదికెను - (6) మన నీతి యెహోవాయే - 2
నీతి న్యాయములు గల దేవుడవు నీవు - నీతిగల నీ మాట వ్యర్థం కాదు
నమ్మిన వారిని - నీతిగ తీర్చావు న్యాయమైన త్రాసులో, తూచువాడవు నీవు
వెదకుడి నా నీతి నా రాజ్యమన్నావు ||హోసన్నా ||
యెహోవా షామా - (6) యెహోవా నివాస స్థలమా - 2
నీ ప్రజల మధ్య నివసించు దేవా నా హృదయ మందిరం నీదె ప్రభూ
రమ్యమైనది నీ నివాసము ప్రియమైనది యెరూషలేము
నీ ఉన్నత సీయోనులోనే ఉందును ||హోసన్నా ||
యెహోవా ఈరే - (6) యెహోవాయే చూచుకొనును - 2