Verse 1
చిట్టిపొట్టి మాటలంటే - చిన్నారి పాపలంటే
ఇష్టమని చెప్పావయ్యా - చక్కనైన మా యేసయ్యా
గట్టి విశ్వాసముంటే - నీవైపే నిలిపి వుంటే
ఆలాంటి వారిదే పరలోక రాజ్యమన్నావ్
ఆమంచి దారిలోనే శుద్ధులుగా మారమన్నావ్ || చిట్టిపొట్టి ||
Verse 2
ఎంత వయస్సు గలవారైనా - మా మనస్సు గలవారైతే
ఆలాంటి వారిదే పరలోక రాజ్యమన్నావ్
ఆమంచి దారిలోనే శుద్ధులుగా మారమన్నావ్ ||చిట్టిపొట్టి ||
Verse 3
మా బాల్య దినములందే - మా సృష్టి కర్త నీవే
నీ స్మరణ చేయమని జీవాత్మ యిచ్చియున్నావ్
జ్ఞానాత్మ బలముతోనే నీకీర్తిని పాడమన్నావ్ ||చిట్టిపొట్టి ||